MNCL: రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి ప్రతి నెల మొదటి, మూడవ ఆదివారం సూపర్ స్పెషాలిటీ వైద్యులు రానున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించి వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.