MHBD: యాచకురాలు మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. 40 ఏళ్ల క్రితం నెల్లికుదురుకు భిక్షాటన చేసుకుంటూ వలస వచ్చిన లచ్చమ్మ మండల కేంద్రంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అందరూ చందాల రూపంలో డబ్బులు జమచేసి లచ్చమ్మ దహన సంస్కారాలు నిర్వహించారు.