కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుల్లో ఒకరైన యర్రంశెట్టి రామాంజనేయులు (ఏ9) పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇతను కీలకంగా వ్యవహరించి ఉన్నాడు. గురువారం కేసరపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఇతను పరారీలో ఉన్నాడు. శుక్రవారం అతనిని కోర్టులో హాజరుపరచనున్నారు.