విశాఖపట్నంలోని ఋరుజులపేటలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మకరశిర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు పల్లా శ్రీనివాసరావుకి వేదాశీర్వచనం అందించారు.