SRD: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనలు పాటించాలని సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి, కంది మండలాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.