ADB: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను రానున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను తపస్ బృందం కోరింది. ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. పీఆర్సీ రిపోర్ట్ వెంటనే తెప్పించి ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతన సవరణ చేయాలన్నారు. పెండింగ్ డీఏలు వెంటనే ప్రకటించాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ పెండింగ్ బిల్స్ చెల్లించాలని కోరారు.