NLG: పేదల కల సహకారం చేసేందుకు కొత్తపేట గ్రామంలో 60 ఇండ్లను మంజూరు చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి చింత విజయ కు మద్దతుగా ఆయన శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.