SKLM: కవిటి ఎస్వీజే కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయికుమార్ ఇవాళ తెలిపారు. మొత్తం 14 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని అన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన, 18–35 ఏళ్ల మధ్య వయస్సుగల అభ్యర్థులు అర్హులని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.