»Nizamabad District 11 Years Old Boy Died In Bodhan Brs Mla Shakil Vehicle Hits
Bodhan ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి.. మిన్నంటిన కుటుంబీకుల రోదనలు
ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన కొత్త కారు (ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు) దీపక్ ను ఢీకొట్టింది. అతి వేగం, నిర్లక్ష్యంతో ఢీకొట్టడంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాలుడిని కుటుంబసభ్యులు నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
బీఆర్ఎస్ పార్టీ బోధన్ (Bodhan) ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. బాలుడి (Boy) మృతితో బాధిత కుటుంబసభ్యులు (Family) కన్నీటి సంద్రంలో మునిగారు. అయితే నిర్లక్ష్యం వాహనం నడపడంతోనే ప్రమాదం (Accident) జరిగిందని తెలిసింది. కాకపోతే ఆ సమయంలో ఎమ్మెల్యే వాహనంలో లేడు. అతడి భార్య ఉంది. ఈ సంఘటన సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమీర్ (Mohammed Shakil Aamir). ఆయన భార్య అయేషా. బోధన్ కు చెందిన దీపక్ తేజ (11) బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన కొత్త కారు (ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు) దీపక్ ను ఢీకొట్టింది. అతి వేగం (Over Speed), నిర్లక్ష్యంతో ఢీకొట్టడంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాలుడిని కుటుంబసభ్యులు నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలవడంతో మెదడుకు (Brain) కూడా దెబ్బలవడంతో వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే బాలుడి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తమ పిల్లాడు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే లేరు. అతడి భార్య (Wife) అయేషా ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ కుటుంబానికి న్యాయం (Justice) చేయాలని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై ఇప్పటికీ కేసు నమోదు కాకపోవడం విశేషం. సయోధ్య కుదుర్చుకుని కేసు లేకుండా చూస్తున్నట్లు సమాచారం.