»Car Runs Into Camel In Rajasthan Animal Gets Stuck Inside Vehicle Video Goes Viral
camel : రోడ్డు ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన ఒంటె.. వీడియో వైరల్
అంతెత్తున ఉండే ఒంటె ప్రమాద వశాత్తూ ఓ చిన్న కారులో ఇరుక్కుపోయింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది. దాన్ని మీరూ చూసేయండి. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి.
Car runs into camel : రోడ్డు ప్రమాదాల్లో జంతువులు గాయ పడే ఘటనల్ని మనం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. అయితే అంతెత్తు ఉండే ఒంటె(Camel) ఒకటి అనుకోని రీతిలో కారులో ఇరుక్కుపోయింది. వేగంగా వస్తున్న కారు ఒకటి ఒంటెపైకి దూసుకుపోయింది. దీంతో ఆ కారు ముందు అద్దంలో నుంచి ఒంటె లోపల ఇరుక్కుపోయింది. చివరికి క్రేన్‌ని తెప్పించి ఆ కారు నుంచి ఒంటెను బయటకు తీశారు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని హనుమగఢ్ జిల్లాలో గత వారం చోటు చేసుకుంది.
కారు ముందు భాగం నుంచి ఒంటె లోపలికి దూరిపోవడంతో దాన్ని బయటకు తీసేందుకు అంతా చాలా శ్రమించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు సైతం స్వల్పంగా గాయాలు అయ్యాయి. అయితే అతడు ఈ ఘటనతో చాలా భయాందోళనలకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్య చికిత్సలు చేశారు. ఇదిలా ఉండగా కారు లోపల ఇరుక్కుపోయిన ఒంటె(Camel) దాని నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నించింది. రాలేక బాధతో ఒక రకమైన అరుపుల్ని అరిచింది. క్రెయిన్ సాయంతో గంటల పాటు శ్రమించి చివరికి దాన్ని బయటకు తీశారు. అప్పుడు తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్(Viral) అయ్యింది. అదే ఇక్కడుంది. మీరూ దానిపై ఓ లుక్కేయండి.