Best Tips Younger Looking Skin : ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే పెద్ద వారిలో కనిపిస్తున్నారు. 30 ఏళ్లకే ముఖంపై గీతలు, ముడతల్లాంటివి వచ్చేస్తున్నాయి. చర్మం బిగుతు సడలడంతో ఇలాంటివి వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకు మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణం లాంటివే ప్రధాన కారణాలు. అయితే చర్మం ఎప్పుడూ యవ్వనవంతంగా కనిపించాలంటే, ప్రీ ఏజింగ్(pre Aging) సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటంటే…?
చర్మం(SKIN) ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఎప్పుడూ తగినంత నీటిని అందించాలి. హైడ్రేటింగ్‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎండలోకి వెళ్లేప్పుడు కచ్చితంగా మంచి సన్ స్క్రీన్‌ని అప్లై చేసుకోవాలి. లేదంటూ అతినీల లోహిత కిరణాల్లాంటివి నేరుగా మన చర్మాన్ని తాకి దాని ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇంకా చర్మాన్ని అప్పుడప్పుడూ ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. అంటే చర్మంపై ఉండే డెడ్ స్కిన్, మృత కణాలు అన్నీ పోయేలా చూసుకోవాలి. అందుకు మన దగ్గర అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో చక్కగా నలుగు పిండితో స్నానం చేసినా సరిపోతుంది.
చర్మం ఎప్పుడూ నవ యవ్వనంగా ఉండాలంటే దానికి సరిపడా మాయిశ్చర్ అందాలి. అందుకు మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనె లాంటిదీ రాసుకోవచ్చు. అలాగే ఫేషియల్ ఎక్సర్సైజులు కూడా ముఖ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. రోజూ కాస్త పెరుగును తీసుకుని ముఖానికి అప్లై చేసి తర్వాత స్నానం చేసేయవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం(SKIN) ఎంతో కండిషన్లో ఉంటుంది. తొందరగా ముడతలు, గీతల్లాంటివి ముఖంపై రాకుండా ఉంటాయి.