»Odisha All 4 Doors Of Puri Jagannath Temple Opened For Ease Of Darshan
Puri : హామీ నెరవేర్చిన బీజేపీ.. తెరుచుకున్న పూరీ ఆలయ నాలుగు ద్వారాలు
కోవిడ్ ఆంక్షలతో మూత పడిన పూరీ ఆలయ నాలుగు ద్వారాలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తలుపులను తెరిపించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Puri Jagannath Temple 4 Doors Open : పూరీ జగన్నాథ ఆలయంలో ఎట్టకేలకు నాలుగు ద్వారాలూ ఈ రోజు తెరుచుకున్నారు. గురువారం ఉదయం తలుపులు ఇలా తెరిచిన తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ మాఝి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట మరి కొందరు కొత్త మంత్రులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. దాదాపుగా ఐదేళ్ల తర్వాత ఇలా నాలుగు ద్వారాలూ(4 DOORS) తెరుచుకోవడంతో భక్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో 2020లో పూరీ జగన్నాథ ఆలయంలోని(PURI JAGANNATH TEMPLE) ద్వారాలను అప్పటి ప్రభుత్వం మూసి వేయించింది. కేవలం సింహద్వారం నుంచి మాత్రమే భక్తులకు దర్శనానికి వీలు కల్పించింది. ఆ తర్వాత కోవిడ్ శాంతించినా గుడి తలుపులు మాత్రం తెరుచుకోలేదు. ఐదేళ్లుగా వాటిని అలా మూసే ఉంచారు. దీంతో బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల సమయంలో లేవనెత్తింది. జేడీయూ ప్రభుత్వం ఎందుకు తలుపులను(DOORS) మూసే ఉంచుతోందంటూ ప్రశ్నించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయ తలుపులు తెరుచుకుంటాయని హామీ ఇచ్చింది.
ఇప్పుడు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఒడిశా సీఎంగా మోహన్ చరణ మాఝి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలయం తలుపులు తెరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం నాలుగు ద్వారాలనూ భక్తుల కోసం తెరిచారు. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకున్న సీఎం ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.