»Telangana Minister Kt Rama Rao Tie Up With Alliantgroup And Technipfmc In Houston
KT Rama Rao భారీ ఒప్పందం.. తెలంగాణకు మొత్తం 12,500 ఉద్యోగాలు రాక
కేటీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం టెక్నిప్ ఎఫ్ఎంసీ, అలియాంట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహం వంటివి వివరించారు.
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దిగ్గజ సంస్థలు, కంపెనీలతో సంప్రదింపులు చేస్తూ తెలంగాణకు ఆహ్వానిస్తున్నారు. కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయి. ఒక్క రోజే రెండు కంపెనీలు కీలక ప్రకటన చేశాయి.
అమెరికాలోని హ్యూస్టన్ (Houston)లో శనివారం కేటీఆర్ (KTR) పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం టెక్నిప్ ఎఫ్ఎంసీ (TechnipFMC), అలియాంట్ సంస్థల (Alliant Group) ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహం వంటివి వివరించారు. మొత్తం రెండు కీలకమైన ఒప్పందాలు చేసుకోగా.. 12,500 ఉద్యోగాలు దక్కనున్నాయి.
ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ (Oil and Gas) దిగ్గజ కంపెనీ అయిన టెక్నిప్ ఎఫ్ఎంసీ తెలంగాణలో (Telangana) భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సాఫ్ట్ వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అండ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి హైదరాబాద్ (Hyderabad)ను ఎంచుకుంది. రూ.1,250 కోట్లతో హైదరాబాద్ లో కేంద్రం ఏర్పాటు చేస్తామని టెక్నిప్ ఎఫ్ఎంసీ ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా ఇంజనీరింగ్ విభాగంలో 2,500 ఉద్యోగాలు, తయారీ రంగంలో వెయ్యి ఉద్యోగాలు రానున్నాయి.
అమెరికాకు చెందిన అలియంట్ గ్రూపు కూడా హైదరాబాద్ తమ కొత్త కేంద్రాన్ని (Centre) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో గుర్తింపు పొందిన అలియంట్ సంస్థతో కేటీఆర్ బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్ లో బీఎఫ్ఎస్ఐ (BFSI) కేంద్రం ఏర్పాటు చేస్తామని అలియంట్ సీఈఓ ధవల్ జాదవ్ (Dhaval Jadav) ప్రకటించారు. హైదరాబాద్ లో 9 వేల మందికి ఉద్యోగాలు (Employment) కల్పిస్తామని వెల్లడించారు. ఆయా కంపెనీల నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ, హైదరాబాద్ పారిశ్రామిక రంగానికి ఊతం ఇస్తుందని తెలిపారు. ఈ కంపెనీల నిర్ణయంతో హైదరాబాద్ కు అతి పెద్ద ప్రోత్సాహం, నగర సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందని కేటీఆర్ తెలిపారు.
Delighted to announce that @TechnipFMC, a French American Oil and Gas giant selects Hyderabad as a key hub for their software Global Delivery Center & Precision Engineering Manufacturing Facility, creating 2,500 jobs in engineering and 1,000 jobs in the manufacturing facility… pic.twitter.com/G9L6EgVwHf
Met with the very dynamic & exuberant @Dhavaljadav02 CEO of Alliant in Houston today who shared a great news after our discussion@AlliantGroup, a powerhouse in consulting and financial services, is going to rev up BFSI sector of… pic.twitter.com/rJmUFKhywl