»Rajasthan Rs 2 Crore Cash 1kg Gold Found In Basement Of Govt Office In Jaipur
Yojana Bhawan భవనం పునాదిలో కోట్ల డబ్బు, కిలో బంగారం.. జైపూర్ లో కలకలం
చాలా నెలలుగా వినియోగించకపోవడంతో తాళాలు వేశారు. అయితే శుక్రవారం ఏదో విషయమై అల్మారాలను తెరచి చూడగా వాటిలో ఒక ట్రాలీ సూట్ కేస్ కనిపించింది. అది తెరచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం కనిపించాయి.
భవనం పునాదిలో (Basement) కోట్ల రూపాయల డబ్బు.. కిలో బంగారం బిస్కెట్లు (Golden Biscuits) లభించాయి. ఆ నగదులో రద్దయిన రూ.2 వేల నోట్ల కట్టలతోపాటు రూ.500 నోట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ.మూడు కోట్ల వరకు ఉండడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయం పునాదిలో ఓ అల్మారాలో ఇవి కనిపించడం రాజస్థాన్ (Rajasthan)లో కలకలం రేపింది. ఈ సంఘటనపై ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో యోజనా భవన్ (Yojana Bhawan) అనే భవనం ఉంది. ఈ భవనంలో ఐటీ విభాగం (IT Wing), జన్ ఆధార్ (Jan Aadhar)వంటి కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనం పునాదిలో కొన్ని అల్మారాలు (Cupboard) ఉన్నాయి. వాటి చాలా నెలలుగా వినియోగించకపోవడంతో తాళాలు (Lock) వేశారు. అయితే శుక్రవారం ఏదో విషయమై అల్మారాలను తెరచి చూడగా వాటిలో ఒక ట్రాలీ సూట్ కేస్ కనిపించింది. అది తెరచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం కనిపించాయి. వెంటనే ఐటీ శాఖ అదనపు డైరెక్టర్ మహేశ్ గుప్తా (Mahesh Gupta) పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి లెక్కలు వేయగా మొత్తం రూ.2.31 కోట్ల విలువైన రూ.2 వేలు, రూ.500 నోట్లు ఉన్నాయి. ఇక బంగారం బిస్కెట్లు కిలో ఉన్నాయి. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. ‘డబ్బు (Cash), బంగారంతో (Gold) పాటు కొన్ని ఫైళ్లు (Files) ఉన్నాయి. వాటిని డిజిటలైజ్ చేవాం. తాళాలు వేసిన మరో రెండు కప్ బోర్డులను కూడా తెరిచాం. ఆ బేస్ మెంట్ ను ఎక్కువగా ఆధార్ విభాగం వారు వినియోగిస్తున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం. త్వరలో వివరాలు బహిర్గతపరుస్తాం’ అని తెలిపారు. కాగా, దీనిపై సమగ్ర విచారణ చేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.