»Ys Vivekananda Reddy Murder Case Once Again Cbi Served Notice To Ys Avinash Reddy
CBI Notice 22న విచారణకు రావాలి.. అవినాశ్ రెడ్డికి సీబీఐ మరో నోటీస్
సీబీఐ మరోసారి విచారణకు హాజరు కావాలని మరో నోటీసు పంపించింది. హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. విచారణకు హాజరైతే అరెస్ట్ అవుతాననే భయంతో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణను త్వరగా ముగించాలని న్యాయస్థానం (Court) ఆదేశాలు జారీ చేయగా.. విచారణకు మాత్రం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) సహకరించడం లేదు. పలుమార్లు విచారణ నుంచి తప్పించుకున్న అవినాశ్ కు సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది.
సీబీఐ విచారణకు శుక్రవారం హాజరు కావాల్సిన అవినాశ్ రెడ్డి అకస్మాత్తుగా గైర్హాజరయ్యారు. రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తల్లి అనారోగ్యానికి గురవడంతో విచారణకు కాకుండా కర్నూలుకు (Kurnool) వెళ్లారు. ఈ విషయాన్ని తన న్యాయవాదుల (Lawyers) ద్వారా సీబీఐకి సమాచారం ఇచ్చారు. పరిగణనలోకి తీసుకున్న సీబీఐ మరోసారి విచారణకు (Investigation) హాజరు కావాలని మరో నోటీసు పంపించింది. ఈనెల 22వ తేదీన సోమవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ (Hyderabad)లోని ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.
అయితే ఈ నోటీసులను వాట్సప్ (Whatsapp) ద్వారా సీబీఐ పంపించడం గమనార్హం. కాగా విచారణకు అవినాశ్ రెడ్డి రెండు సార్లు గైర్హాజరయ్యాడు. అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం.. విచారణకు హాజరైతే అరెస్ట్ అవుతాననే భయంతో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఈ పరిణామాలపై సీబీఐ ఆగ్రహంగా ఉంది. మరోసారి విచారణకు గైర్హాజరైతే అరెస్ట్ చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం.