YS Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకా హత్య కేసులో అవినాష్‌ను అదుపులోకి తీసుకోవాలని దర్యాప్తు సంస్థ సీబీఐ అనుకుంటోంది. ముందస్తు బెయిల్ (Bail) ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ రోజు కూడా విచారణ జరిగింది. బుధవారం వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని కోర్టు స్పష్టంచేసింది. ఆ రోజు ముందస్తు బెయిల్ (Bail) పిటిషన్‌పై తీర్పు ఇస్తానని పేర్కొంది. అవినాష్ తల్లి ఆరోగ్యం బాగోలేనందున అదుపులోకి తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంచేసింది.
వాదనల సందర్భంగా అవినాశ్ రెడ్డిపై (YS Avinash Reddy) ఏ ఆధారాలతో అభియోగాలు మోపుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. సాక్షుల వాంగ్మూలాలతో అని సీబీఐ తెలిపింది. సీల్డ్ కవర్లో సాక్షుల వాంగ్మూలాలను సమర్పిస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీనికి హైకోర్టు అంగీకరించింది.బెయిల్ (Bail) పిటిషన్‌పై నిన్న కూడా వాదనలు జరగగా.. ఈ రోజు కొనసాగింపుగా విచారణ జరిగింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. నిన్న అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) , సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఈ రోజు సీబీఐ తరఫు న్యాయవాది అనిల్ వాదించారు. విచారణ సందర్భంగా సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేశ్ శర్మ, సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కోర్టు హాల్‌కు వచ్చారు. కేసు దర్యాప్తులో అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) ఆటంకం కలిగిస్తున్నాడని సీబీఐ తరఫు లాయర్ అనిల్ అన్నారు. విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని చెప్పారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయని అనగా.. వెకేషన్ బెంచ్ కొన్ని ప్రశ్నలు వేసింది.