Karnataka Cabinet expansion: కర్ణాటక మంత్రివర్గ విస్తరణ (Karnataka Cabinet expansion) జరిగింది. 24 మంది మంత్రులుగా (24 ministers) ప్రమాణ స్వీకారం చేశారు. 8 మంది లింగాయత్, ఆరుగురు వొక్కలిగ, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీలు, కురుబ, రాజు, మరాఠా, ఎడిద, మొగవీర అనే కూలాలకు చెందిన ఐదుగురికి పదవీ వరించింది. మంత్రుల్లో 9 మంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన వారే ఉన్నారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు.
బ్రాహ్మణ కులానికి చెందిన దినేశ్ గుండు రావుకు (dinesh gundu rao) కూడా మంత్రిగా అవకాశం లభించింది. పాత మైసూర్, కల్యాణ కర్ణాటకకు చెందిన వారు ఏడుగురు ఉండగా.. ఆరుగురు కిట్టూరు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు సెంట్రల్ కర్ణాటక నుంచి ఉన్నారు. సామాజిక సమీకరణాలు, కులాల ఆధారంగా ఈ కూర్పు జరిగింది. దినేశ్ గుండు రావు, కృష్ణ బైరే గౌడ్, ఈశ్వర్ ఖాండ్రే, రషీమ్ ఖాన్, సంతోష్ లాద్, కేఎన్ రాజన్న, కే వెంకటేష్, హెచ్సీ మహాదేవప్ప, బైరటి సురేశ్, శివరాజ్ తంగడి, ఆర్బీ తిమ్పూర్, బీ నాగేంద్ర, లక్ష్మీ హెబ్బల్కర్, మధు బంగారప్ప, డీ సుధాకర్, చెలువరయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసీ సుధాకర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
కర్ణాటకలో 34 మంది మంత్రులుగా అవకాశం ఉంది. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ఇదివరకే బాధ్యతలు చేపట్టగా.. ఈ రోజు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో 8 మందికి అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పునకు సంబంధించి.. నిన్న ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చర్చించారు. తర్వాత మంత్రులు పేర్లను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి ఖరారు చేశారు.