»New Parliament Building Inaugaration And Niti Aayog Meet Its Useless Says Bihar Cm Nitish Kumar
New Parliament Building పనికి మాలిన పని.. కొత్త భవనం అవసరమా? బిహార్ సీఎం
ఇన్ని రోజులు భవనం కొనసాగుతోంది. అసలు కొత్త భవనం నిర్మించాల్సిన పనే లేదు. ఇదంతా పనికిమాలింది. రాష్ట్రపతిని పిలవకుండా ప్రారంభించడం దారుణం. ఏం సాధిస్తున్నారు?.
సుందరమైన భవనం.. చెక్కుచెదరని నిర్మాణం (Strong Building).. మరో వందేళ్లయినా ఉండే సౌధం.. అలాంటి భవనాన్ని వదిలేసి కొత్త పార్లమెంట్ భవనం (New Parliament Complex) నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు కొత్తగా నిర్మితమైన భవనాన్ని రాష్ట్రపతి (President of India) చేతులమీదుగా కాకుండా ప్రధాని ప్రారంభించనుండడం రాజ్యాంగ ఉల్లంఘనకు (Constitution Violation) దారి తీస్తోంది. ఈ కార్యక్రమంపై దాదాపు 21 పార్టీలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘అసలు కొత్త భవనం అవసరం ఏమిటి’ అని బిహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రశ్నించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై శనివారం నితీశ్ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘పాత పార్లమెంట్ భవనం చరిత్రాత్మకమైనది (Historical Building). అధికారంలో ఉన్న వ్యక్తులు చరిత్రను (History) మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కొత్త భవనం ఎందుకు అవసరం? ఇన్ని రోజులు భవనం కొనసాగుతోంది. అసలు కొత్త భవనం నిర్మించాల్సిన పనే లేదు. ఇదంతా పనికిమాలింది. రాష్ట్రపతిని పిలవకుండా ప్రారంభించడం దారుణం. ఏం సాధిస్తున్నారు?. నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశానికి, పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరుకావడం అంటే అది తెలివి లేని పని’ అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 21 పార్టీలలో నితీశ్ కుమార్ కు చెందిన జేడీ (యూ) (JDU) కూడా ఉంది. ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నితీశ్ దేశవ్యాప్త పోరాటం మొదలుపెట్టారు. ప్రతిపక్షాల (Opposition Parties) ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్టాలిన్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. త్వరలోనే మరికొందరితో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
#WATCH | What was the need for a new Parliament? The earlier building was a historic one. I have repeatedly said that the people in power will change the history of this country. There was no sense to attend the NITI Aayog meeting today and also the inauguration of the new… pic.twitter.com/ocLyBPLF4U