»Mulugu Telangana Minister Satyavathi Rathod Escaped Safely In Accident
Mulugu మంత్రి సత్యవతి రాథోడ్ కి తప్పిన ప్రమాదం.. వాహనం బోల్తా
గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి యథావిధిగా హైదరాబాద్ వెళ్లిపోయారు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె కాన్వాయ్ (Convoy)లోని ఓ వాహనం బోల్తా పడింది. డ్రైవర్ తో పాటు ఎస్కార్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన ములుగు జిల్లాలో (Mulugu District) జరిగింది.
ములుగు జిల్లాలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో (Seethakka) కలిసి శుక్రవారం పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మంత్రి రాత్రిపూట హైదరాబాద్ (Hyderabad)కు తిరుగు ప్రయాణమయ్యారు. తాడ్వాయి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బొలెరో (Bolero) వాహనం మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని (Escort Vehicle) ఢీకొట్టింది. ప్రమాదంలో బొలెరోతోపాటు ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఎస్కార్ట్ వాహనంలోని డ్రైవర్, సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే కిందకు దిగిన మంత్రి వారిని దగ్గరుండి ఆస్పత్రికి (Hospital) తరలించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి యథావిధిగా హైదరాబాద్ వెళ్లిపోయారు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా అంతకుముందు ముప్పనపల్లిలో పెట్రోల్ బంక్ (Petrol Bunk), మండల ప్రజా పరిషత్ కార్యాలయం (MPP Office), గ్రామ ఆస్పత్రిని మంత్రి సత్యవతి స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏటూరునాగారంలోని (EturNagaram) ప్రభుత్వ ఆస్పత్రిలో ఇమ్యునోలాజికల్ డయాగ్నసిస్ భవనాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనుల విషయమై ఆరా తీశారు.