KRNL: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లాలో 361 పాఠశాలలకు 361 మంది అధికారులను మెంటార్లుగా నియమించినట్లు కలెక్టర్ ఏ.సిరి శనివారం తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ను పటిష్ఠంగా అమలు చేసి ఈ ఏడాది 90శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. డ్రాపౌట్ అయిన 1,559 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకురావాలన్నారు.