»Revanth Reddy Convoy Accident At Rajanna Sircilla
Revanth convoy accident:రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం.. ఢీ కొన్న కార్లు
Revanth reddy convoy accident:టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కాన్వాయ్‌కు (convoy) ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాద (sri prada) ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ (accident) అయ్యింది. కాన్వాయ్‌లోని నాలుగైదు (5 cars) కార్లు ఢీ కొన్నాయి.. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని (Revanth reddy) ఫాలో అవుతున్న మీడియా ప్రతినిధుల (media persons) వాహనాలు కూడా ప్రమాదం జరిగింది. కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Revanth reddy convoy accident:టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కాన్వాయ్‌కు (convoy) ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాద (sri prada) ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ (accident) అయ్యింది. కాన్వాయ్‌లోని నాలుగైదు (5 cars) కార్లు ఢీ కొన్నాయి.. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని (Revanth reddy) ఫాలో అవుతున్న మీడియా ప్రతినిధుల (media persons) వాహనాలు కూడా ప్రమాదం జరిగింది. కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. తర్వాత రేవంత్ రెడ్డి (Revanth reddy) మరో కారులో శ్రీపాద ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లారు.
శ్రీపాద 9వ ప్యాకేజి కాలువను రేవంత్ రెడ్డి (Revanth reddy) సందర్శించారు. కాలువ పనులు పూర్తి చేయకాలేదు. ఇదే విషయంపై అధికారులను ఫోన్ చేసి (phone) అడిగారు. శ్రీపాద కాలువ పనులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడానికి , అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) కాంట్రాక్టర్లకు లొంగిపోవడం వల్లే పనులు ఆలస్యం అయ్యాయని ఆరోపించారు. తక్షణమే 9వ ప్యాకేజి పనులు పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పాదయాత్రలో తనకు భద్రత పెంచాలని రేవంత్ (Revanth reddy) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ (Revanth reddy) పాదయాత్రకు సర్కార్ భద్రతను కల్పిస్తోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది (జీపీ) తెలిపారు. రేవంత్ (Revanth reddy) పాదయాత్రకు భద్రత కల్పిస్తే ఎందుకు విచారణకు పిటిషన్ వచ్చిందని లాయర్‌ను ప్రశ్నించారు. రేవంత్ పాదయాత్రకు ప్రభుత్వం కల్పించే భద్రత గురించి సోమవారం తెలియజేయాలని రేవంత్ తరఫు లాయర్‌కు మేజిస్ట్రేట్ సూచించారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీ (సోమవారానికి) వాయిదా వేసింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (Revanth reddy) ఇటీవల వరంగల్ జిల్లా భూపాలపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు టమాటాలు, గుడ్లు విసిరారు. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి (Revanth reddy) మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి (Revanth reddy) వైపు దూసుకొచ్చి.. రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను థియేటర్ లో బంధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న థియేటర్‌పై రాళ్లు రువ్వారు. దీంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉద్రిక్తతల మధ్య రేవంత్ రెడ్డి (Revanth reddy)ప్రసంగం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ భద్రతకు సంబంధించి సోమవారం కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.