»Tsrtc Launched Snack Box In E Garuda Bus From Hyderabad To Vijayawada
TSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ తోపాటే స్నాక్స్, నీళ్ల సీసా కూడా..
ప్రయాణికుల అభిప్రాయం మేరకు మిగతా బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. స్నాక్ బాక్స్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను స్కాన్ చేసి అభిప్రాయం, సలహాలు, సూచనలు చేయవచ్చు. ఈ స్నాక్ బాక్స్ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించేలా కనిపిస్తోంది.
ప్రయాణికులను (Passengers) ఆకట్టుకునేందుకు.. పనిలో పనిగా ఆదాయం (Income) పెంచుకునేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation) వినూత్న కార్యక్రమాలు, పథకాలు చేపడుతోంది. సౌకర్యాలు మెరుగుపరుస్తూనే.. కొత్త బస్సులు (Bus) తీసుకొస్తూ ప్రయాణికుల ఆదరణ పొందుతున్న టీఎస్ ఆర్టీసీ (TSRTC) మరో వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. ఇకపై టికెట్ (Ticket)తోపాటు స్నాక్స్ (Snacks) కూడా అందనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దూర ప్రాంతాలకు ప్రయాణం (Journey) చేసే ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ స్నాక్ బాక్స్ (Snack Box) ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు చిన్నపాటి నీళ్ల సీసా (Water Bottle) అందిస్తున్నారు. ఇక నుంచి నీళ్ల సీసాతో పాటు స్నాక్ బాక్స్ అందించనున్నారు. ఇది శనివారం నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. టికెట్ ధరలో అదనంగా స్నాక్ బాక్స్ కు రూ.30 వసూలు చేయనున్నారు. ఈ స్నాక్ బాక్స్ లో మౌత్ ఫ్రెషనర్ (Mouth Freshner), కారా (Mixer), చిక్కి ప్యాకెట్, టిష్యూ పేపర్ (Tissue) ఉంటాయి. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ గరుడ బస్సుల్లో అమలు చేయనున్నారు.
విజయవాడకు (Vijayawada) హైదరాబాద్ (Hyderabad) నుంచి ఇటీవల ఈ గరుడ అనే ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus) వేసిన విషయం తెలిసిందే. 9 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో స్నాక్స్ బాక్స్ అమలు చేయనున్నారు. ప్రయాణికుల అభిప్రాయం (Opinion) మేరకు మిగతా బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. స్నాక్ బాక్స్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ (Code)ను స్కాన్ చేసి అభిప్రాయం, సలహాలు, సూచనలు చేయవచ్చు. ఈ స్నాక్ బాక్స్ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించేలా కనిపిస్తోంది.
హైదరాబాద్ లో సాధారణ ప్రయాణికుల కోసం మరో కార్యక్రమాన్ని అమలు చేసింది. శనివారం నుంచి ‘జనరల్ రూట్ పాస్’ను (General Route Pass) ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. నెల రోజుల పాటు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత రాకపోకలకు ఈ పాస్ వర్తిస్తుంది. ఆర్డినరీ రూట్ పాస్ కు రూ.600.. మెట్రో ఎక్స్ ప్రెస్ కు రూ.వెయ్యిగా ధర నిర్ణయించారు. స్వల్ప దూరం ప్రయాణించే వారికి ఈ పాస్ ఎంతో ఉపయోగపడనుంది. బస్ పాస్ కేంద్రాల్లో (Bus Pass Counter) ఈ పాస్లు అందుబాటులో ఉన్నాయి.
#Hyderabad లో సాధారణ ప్రయాణికులకు నేటి నుంచి ‘జనరల్ రూట్ పాస్’ను #TSRTC అందుబాటులోకి తీసుకువచ్చింది. నెల రోజుల పాటు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత రాకపోకలకు ఈ పాస్ వర్తిస్తుంది. ఆర్డినరీ రూట్ పాస్ కు రూ.600.. మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ కు రూ.1000గా ధరను సంస్థ నిర్ణయించింది. స్వల్ప… pic.twitter.com/83zGRxOGip
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) May 27, 2023