MBNR: జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలతో జిల్లాలో 6 ప్రదేశాలలో ‘మాక్ డ్రిల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, మాక్ డ్రిల్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.