»Dimple Hayati Dating With David Victor Whos That Person Netizens Questioning Their Relationship
Dimple Hayati విక్టర్ డేవిడ్ ఎవరు.. డింపుల్ హయాతి లవరా? వారిద్దరూ డేట్ లో ఉన్నారా.?
గొడవను పక్కనపెట్టి ఇంతకీ డేవిడ్ ఎవరు? అని నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెడుతున్నారు. ఈ గొడవపై డింపుల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుండగా.. వాటి కింద ‘ఇంతకీ డేవిడ్ ఎవరు?’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అందరి కళ్లు డేవిడ్ పై పడ్డాయి.
అపార్ట్ మెంట్ (Apartment)లో జరిగిన గొడవ హీరోయిన్ వ్యక్తిగత జీవితంలోని (Personal Life) రహాస్యాలను బహిర్గత పరిచింది. ఆమె ఎవరితో కలిసి ఉంటుందో అందరికీ తెలిసిపోయింది. డింపుల్ హయాతి (Dimple Hayati) జీవితం ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ట్రాఫిక్ డీసీపీతో గొడవ న్యాయస్థానానికి చేరింది. ఈ గొడవలో ఆమెకు మద్దతుగా ఎవరూ నిలవకపోగా.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. ఇంతకీ ఆమెతో ఉన్నది ఎవరు? ఆయన ఎవరు? హయాతికి అతడితో సంబంధం (Relation) ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఖిలాడీ, సామాన్యుడు సినిమాలు చేసిన హయాతి ఇటీవల గోపీచంద్ (Gopichand)తో చేసిన రామబాణం సినిమా నిరాశపర్చింది. ప్రస్తుతం రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సమయంలో డీసీపీతో గొడవ జరగడం ఆమె కెరీర్ (Career)పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఈ గొడవ కుదుపేసింది. ఈ సమయంలో హైదరాబాద్ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో ఉంటున్న నివాసంలో డేవిడ్ విక్టర్ (David Victor) అనే వ్యక్తి వెలుగులోకి వచ్చాడు.
డీసీపీతో గొడవ (Traffic DCP) మొదలైనప్పటి నుంచి డేవిడ్ ఆమె వెంట ఉంటున్నాడు. పోలీస్ స్టేషన్ (Police Station) కు వెళ్తే కూడా డింపుల్ హయాతి వెంట డేవిడ్ ఉన్నాడు. దీంతో గొడవను పక్కనపెట్టి ఇంతకీ డేవిడ్ ఎవరు? అని నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెడుతున్నారు. ఈ గొడవపై డింపుల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుండగా.. వాటి కింద ‘ఇంతకీ డేవిడ్ ఎవరు?’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అందరి కళ్లు డేవిడ్ పై పడ్డాయి.
డింపుల్ హయాతి స్వస్థలం ఏపీలోని విజయవాడ (Vijayawada). ఆమె వెంట ఉంటున్న డేవిడ్ విక్టర్ స్నేహితుడు (Friend) అని తెలుస్తోంది. దూరపు బంధువు కూడా సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆమెతో పాటు నివసిస్తున్నాడని పుకార్లు వస్తున్నాయి. అతడు గ్రాఫిక్ డిజైనర్ (Graphic Designer)గా పని చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నివసిస్తున్నా వారిద్దరి మధ్య ప్రేమ లేదని సమాచారం. అయితే వీరి బంధంపై ఆమె తరఫు న్యాయవాది (Lawyer) ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.