Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ
ఒడిశాలో రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident) సిగ్నలింగ్ లోపం వల్లే జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. గూడ్స్ ట్రైన్లో ఇనుము ముడి పదార్థాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని, అందుకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident)పై సీబీఐ విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది. ఈ ప్రమాదం విచారణను సీబీఐతో చేయిస్తున్నట్లు ప్రకటించింది. విచారణ నిమిత్తం రైల్వే బోర్టు సీబీఐకు సిఫారసు చేసింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini vaishnav) ఈ విషయాన్ని తెలిపారు. సీబీఐ(central bureau of investigation) సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని, వాస్తవాలేంటో సీబీఐతో బయటపడతాయన్నారు. ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
ఒడిశాలోని బహనగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం(Odisha Train Accident)లో మూడు రైళ్లు ఢీకొన్నాయి. 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ వెయ్యి మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఘటనా స్థలానికి స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆస్పత్రికి చేరుకుని గాయాలపాలైన వారిని పరామర్శించారు. కాగా ఈ ఘటన(Odisha Train Accident)లో సిగ్నలింగ్ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. గూడ్స్ ట్రైన్లో ఇనుము ముడి పదార్థాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని, అందుకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.