»Ashwini Vaishnaw Said We Have Identified The Cause Of The Odisha Train Accident
Ashwini Vaishnaw: రైలు ప్రమాదానికి గల కారణం గుర్తించాం
ఒడిశాలోని బాలాసోర్‌లో 288 మంది ప్రాణాలు కోల్పోయి, 1,000 మందికి పైగా గాయపడిన విపత్కర ట్రిపుల్ రైలు ఢీకొనడానికి(Odisha train accident) గల కారణాలను(cause) గుర్తించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) ఆదివారం తెలిపారు.
ఆదివారం బాలాసోర్‌లో రైళ్లు ఢీకొన్న(Odisha train accident) ప్రదేశంలో పునరుద్ధరణ పనులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) సమీక్షించారు. ప్రమాదానికి గల మూలకారణాన్ని గుర్తించామని ఈరోజు నాటికి ట్రాక్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్పారు. బుధవారం ఉదయానికి పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు రైల్వే సేఫ్టీ కమీషనర్ తో ఈ విషయంపై చర్చించినట్లు వెల్లడించారు. ఆ క్రమంలో సంఘటనకు గల కారణాన్ని(cause) గుర్తించామని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ఇది జరిగిందన్నారు. అదే ఇప్పుడు మా దృష్టికి వచ్చిందని అన్నారు. దీంతోపాటు అందుకు గల బాధ్యులను కూడా గుర్తించామని, త్వరలోనే పూర్తి నివేదిక అందుతుందన్నారు.
ఒడిశాలోని బాలాసోర్‌లోని రైలు ప్రమాద(accident) స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. 1000 మంది కార్మికులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 7 పొక్లెన్ యంత్రాలు, 2 ప్రమాద సహాయ రైళ్లు, 3-4 రైల్వే, రోడ్ క్రేన్లు మోహరించబడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో వెల్లడించారు. దీంతోపాటు భారత వైమానిక దళం (IAF) చనిపోయిన, గాయపడిన వారిని తరలించడానికి Mi-17 హెలికాప్టర్లను మోహరించింది. మరోవైపు తూర్పు కమాండ్ కూడా IAF పౌర పరిపాలన, భారతీయ రైల్వేలతో సహాయక చర్యలను సమన్వయం చేస్తుంది.
బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం మూడు వేర్వేరు ట్రాక్‌లపై(tracks) రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ క్యారేజీ ఢీకొన్నాయి. దీంతో ఇది చరిత్రలో అత్యంత వినాశకరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్లకు చెందిన 17 కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 288 మంది మృతి చెందగా, 1,000 మందికి పైగా గాయపడ్డారు.