Avinash Reddy కర్నూలు to హైదరాబాద్.. ఏఐజీ ఆస్పత్రిలో చేరిన అవినాశ్ తల్లి
హైదరాబాద్ కు అవినాశ్ రావడంతో మరి సీబీఐ అధికారులు ఏం చేస్తారో తెలియాల్సి ఉంది. వారం రోజులుగా విచారణకు రాకుండా కర్నూలులో తిష్టవేసిన అవినాశ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) విషయంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. అతడి తల్లి లక్ష్మి ఆరోగ్యం మెరుగైందని నిన్న ఆస్పత్రి ప్రకటించగా.. నేడు అకస్మాత్తుగా మెరుగైన వైద్యం కోసమని చెప్పి హైదరాబాద్ కు తరలించారు. తల్లి అనారోగ్యం పేరిట సాగిస్తున్న డ్రామా కర్నూలు నుంచి హైదరాబాద్ కు చేరింది.
ఈనెల 19వ తేదీన నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సీబీఐ (CBI) విచారణకు హాజరుకావాల్సిన అవినాశ్ తల్లికి అస్వస్థతకు గురయ్యారని హైదరాబాద్ (Hyderabad) నుంచి హుటాహుటిన కర్నూలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ రోజు పులివెందులలోని బాకరాపురంలోని నివాసంలో అవినాశ్ తల్లి లక్ష్మికి గుండెనొప్పి వచ్చింది. స్థానికంగా ప్రాథమిక వైద్యం అనంతరం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో (Viswa Bharati Hospital) చేర్పించారు. ఆమె పరిస్థితి మెరుగైందని కోలుకున్నారని గురువారం ఆస్పత్రి హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. తీరా శుక్రవారం ఆమెకు మెరుగైన వైద్యం కోసం అని చెప్పి హైదరాబాద్ కు తరలించారు.
అవినాశ్ తల్లిని గచ్చిబౌలిలోని (Gachibowli) ఏఐజీ ఆస్పత్రిలో (AIG Hospital) చేర్పించారు. పరిస్థితి నిలకడగా ఉండడంతో శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు విశ్వభారతి ఆస్పత్రి ప్రకటించింది. అక్కడి నుంచి నేరుగా ఏఐజీకి తరలించారు. తల్లితోపాటు ఆమె కుమారుడు అవినాశ్ ఆస్పత్రిలో ఉన్నాడు. హైదరాబాద్ కు అవినాశ్ రావడంతో మరి సీబీఐ అధికారులు ఏం చేస్తారో తెలియాల్సి ఉంది. వారం రోజులుగా విచారణకు (Investigation) రాకుండా కర్నూలులో తిష్టవేసిన అవినాశ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది. కాగా, కర్నూలులో ఉన్నన్ని రోజులు అవినాశ్ నాటకాలు కొనసాగాయని.. ఇక హైదరాబాద్ లో అలాంటివి కొనసాగవని ప్రతిపక్షాలు (Opposition Parties) పేర్కొంటున్నారు. రెండు, మూడు రోజుల్లో అతడి అరెస్ట్ ఉంటుందని చెబుతున్నారు.