»Chhattisgarh Officer Pumps Out 21 Lakh Litres Of Water From Dam To Find Lost Phone
Mobile Phone కోసం డ్యామ్ నే ఖాళీ చేయించిన అధికారి.. లక్షల లీటర్ల నీళ్లు వృథా
ఆయకట్టు రైతులు నీరు వృథాగా పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు నీటిని ఆపేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోశారు. అధికారిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఎంతో విలువైన నీటిని వృథా చేశారని రైతులు, స్థానికులు మండిపడ్డారు.
అధికారం (Power) ఉంది కదా అని ఎలా పడితే అలా చేస్తే ప్రజలు (Public) ఊరుకోరు. అధికార దుర్వినియోగానికి (Misuse) పాల్పడితే ఉన్న అధికారం కోల్పోవాల్సి వస్తుంది. చత్తీస్ గడ్ (Chhattisgarh)లో ఇలాగే ఓ అధికారి చేయగా అతడు సస్పెండ్ కు గురయ్యాడు. అతడు చేసిన పని ఏమిటో తెలుసా? రూ.లక్ష ఖరీదైన ఫోన్ (Mobile Phone) నీటిలో పడిందని చెప్పి ఏకంగా డ్యామ్ నే ఖాళీ చేయించాడు. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించి అతడిపై చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చత్తీస్ గఢ్ కంకారా జిల్లాలోని (Kanker District) కొల్లబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ (Rajesh Vishwas) ఆహార ధాన్యాల సరఫరా శాఖలో అధికారిగా ఉన్నారు. ఈనెల 21వ తేదీన ఆదివారం సెలవు కావడంతో ఖేర్ ఖట్ట డ్యామ్ (Kherkatta Dam)ను సందర్శించాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా రూ.లక్ష విలువైన అతడి ఫోన్ జారి నీటిలో పడిపోయింది. కంగారుపడిన రాజేశ్ విశ్వాస్ స్థానికులకు సమాచారం ఇచ్చాడు. అక్కడి గజ ఈతగాళ్లు (Swimmers) ఫోన్ కోసం ముమ్మరంగా గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో తనకు ఫోన్ తప్పనిసరిగా కావాలని పట్టుబడ్డాడు. అంతటితో ఊరుకోకుండా ఆ డ్యామ్ ను ఖాళీ చేయిస్తే ఫోన్ లభిస్తుందని భావించాడు.
అనుకున్నదే తడువు డ్యామ్ (Reservoir)ను మూడు రోజులపాటు ఖాళీ చేయించాడు. దాదాపు 15 అడుగుల లోతు ఉన్న డ్యామ్ (Dam)లో 10 అడుగుల మేర నీళ్లు (Water) ఉన్నాయి. ఆ నీటిని 30 హెచ్పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను (Pump Motors) పెట్టి మూడు రోజుల పాటు 21 లక్షల లీటర్ల నీటిని ఎత్తిపోశారు. సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు. అయితే ఆయకట్టు (Farmland) రైతులు (Farmers) నీరు వృథాగా పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు నీటిని ఆపేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోశారు.
అధికారి రాజేశ్ విశ్వాస్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో (Summer) ఎంతో విలువైన నీటిని వృథా చేశారని రైతులు, స్థానికులు మండిపడ్డారు. ఈ సమాచారం అందడంతో ప్రభుత్వం వెంటనే రాజేశ్ ను సస్పెండ్ (Suspend) చేసింది. ఒక ఫోన్ కోసం రైతులకు విలువైన నీటిని వృథాపాలు చేయడం సరికాదని చెబుతున్నారు. కాగా, లక్షల నీటర్లను తోడేసిన తర్వాత అతడి ఫోన్ (Phone) లభించడం విశేషం. నీటిలో తడవడంతో ఆ ఫోన్ పని చేయడం లేదు. అయితే ఆ ఫోన్ లో అధికారిక సమాచారం ఉండడంతోనే డ్యామ్ నీటి ఖాళీ చేయించాల్సి వచ్చిందని అధికారి రాజేశ్ విశ్వాస్ తెలిపాడు. అయినా కూడా అతడి వివరణతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు.
In #Chhattisgarh, an officer's I-phone fell into a dam reservoir. Two pumps of 30 horsepower, ran 24 hrs, and pumped out-hold your breath- 21 lakh litres of #water, this water could have irrigated 1,500 acres of land, & this is when "there is severe shortage of water i the area ! pic.twitter.com/vBSol7EafS
— Ramandeep Singh Mann (@ramanmann1974) May 26, 2023