వైఎస్ వివేకా హత్య కేసు(YS Vivekananda Reddy murder case) ఇప్పటిలో ముగిసేలా లేదు. ఈ కేసును సీబీఐ(CBI) దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సుప్రీం ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. జూన్ 30లోగా వివేకా హత్య కేసులోని పూర్తి వివరాలను బయటపెట్టాలని సీబీఐని గతంలోనే న్యాయస్థానం ఆదేశించింది. నేడు సుప్రీంలో ఈ కేసుకు సంబంధించిన కీలక విచారణ జరగనుండగా మరోవైపు నాంపల్లి కోర్టులో కూడా విచారణ సాగుతోంది.
నిందితులను సీబీఐ కోర్టు(CBI Court)లో హాజరుపరుచనుండగా సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి నేటితో సీబీఐ గడువు ముగిసిపోవాలి. అయితే సీబీఐ అధికారులు సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ అధికారులు ప్రస్తావించడంతో వైఎస్ వివేకా హత్య కేసు(YS Vivekananda Reddy murder case) విచారణను జులై 14కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
సుప్రీం కోర్టు(Supreme Court) విచారణకు ముందుగానే ఈ కేసు దర్యాప్తును ముగించినట్లుగా సీబీఐ(CBI) తెలిపింది. వైఎస్ వివేకా హత్య కేసు(YS Vivekananda Reddy murder case)కు సంబంధించిన పూర్తి నివేదికను సుప్రీం కోర్టుకు సీబీఐ సమర్పించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన పేర్లను జులై 3వ తేదిన కోర్టులో జరిగే విచారణ(Investigation)లో బయటపెట్టనున్నట్లు వెల్లడించింది.