»Shock For Tdp Case Registered Against 45 People Including Chandrababu Pa
AP Politics: టీడీపీకి షాక్..చంద్రబాబు పీఏ సహా 45 మందిపై కేసు నమోదు
రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ సహా 44 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో వారిపై హెడ్ కానిస్టేబుల్ మణి ఫిర్యాదు చేశాడు.
ఏపీలో రాజకీయాలు(Ap Politics) భగ్గుమంటున్నాయి. అధికార వైసీపీ(YCP), ప్రతిపక్ష టీడీపీ(TDP) మధ్య హోరాహోరీ యుద్ధమే జరుగుతోంది. ఎన్నికలు(Elections) సమీపిస్తున్న తరుణంలో మాటల యుద్ధాలు హోరుమంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా చిత్తూరు-కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ నాయకులపై రామకుప్పం(Ramakuppam) పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదైంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సొంత నియోజకవర్గంలో షాక్ తగిలినట్లైంది.
రామకుప్పం(Ramakuppam) మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచ్ అయిన మహాదేవి, ఆమె భర్త జయశంకర్‌లను ఎస్ఐ కృష్ణయ్య దూషించి ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ మాజీ సర్పంచ్ దంపతులు తమ ప్రాంతంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఐ కృష్ణయ్య మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ(TDP) ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళనల్లో టీడీపీ(TDP) నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు పీఏ మనోహర్(Chandrababu PA Manohar) కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని హెడ్‌కానిస్టేబుల్ మణి(Headconstable Mani) ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబు పీఏ మనోహర్‌తో పాటుగా 44 మందిపై రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 143, 341, 353, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో కుప్పం పాలిటిక్స్ తారా స్థాయికి చేరుకున్నాయి.