నెల్లూరు: ఇందుకూరుపేట వ్యవసాయ కోపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీలో ఇందుకూరుపేట, కొత్తూరు జగదేవిపేట గ్రామ రైతులకు ధాన్యం కొనుగోలు మీద శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రేట్ ఏ ధాన్యము అనగా BPT-5204, KNM-1638, RNR-15048 వరి ధాన్యాలకు ఒక క్వింటాకు రూ. 2389లు, ఒక పుట్టికి రూ. 20,306. 50 మద్దతు ధరగా గవర్నమెంట్ నిర్ణయించిందన్నారు.