PLD: నూజెండ్ల (M) ముప్పరాజువారిపాలెంలో శనివారం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.