»Cpi Leader K Narayana Fire On Modi 2000 Rupee Notes Withdrawn
2000 Note రద్దు వెనుక ప్రధాని మోదీ అవినీతి: నారాయణ విమర్శలు
తాజా నిర్ణయంతో కార్పొరేట్ కంపెనీలు, ధనవంతులు వేల కోట్ల నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకుంటున్నారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడానికి వీలుగా ప్రధాని నోట్ల రద్దు చేశారు.
నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వం అపరిపక్వ నిర్ణయాలతో దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నదని ప్రజలతో పాటు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది పెద్ద విఫలమైనదని తెలిసినా.. మళ్లీ రూ.2 వేల నోట్ల ను (Rs 2000 Note Ban) రద్దు చేయడం మరో భారీ తప్పిదంగా పేర్కొంటున్నారు. గతంలో చేసిన నోట్ల రద్దుతో ఏం సాధించారు? ఇప్పుడు మళ్లీ ఏం సాధించబోతున్నారు? అని నిలదీస్తున్నారు. దీనిపై సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె నారాయణ (K Narayana) స్పందించారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తాను చేసిన అవినీతి (Corruption) కుంభకోణం బయటపడుతుందనే భయంతో నోట్ల రద్దు చేశారని ఆరోపించారు. ‘రూ.2 వేల నోట్లను నిషేధించకుండా దాన్ని మార్చుకోవడానికి అవకాశం కల్పించడంతోనే మోదీ అవినీతి కుంభకోణం బయటపడుతున్నది. గతంలో నోట్ల రద్దు నిర్ణయాతో సామాన్యులు (Common People) ఇబ్బందులు పడ్డారు. తాజా నిర్ణయంతో కార్పొరేట్ కంపెనీలు, ధనవంతులు వేల కోట్ల నల్లధనాన్ని (Black Money) తెల్ల ధనంగా మార్చుకుంటున్నారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా (White Money) మార్చుకోవడానికి వీలుగా ప్రధాని నోట్ల రద్దు చేశారు. చలామణిలోకి రూ.2 వేల నోట్లను తీసుకొచ్చారు. వాటిని నిషేధించకుండా మార్చుకునే అవకాశం ఇవ్వడం ధనవంతులకు మేలు చేయడమే. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా నోట్ల రద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సామాన్యులకు నష్టం తప్ప లాభం లేదు’ అని నారాయణ విమర్శించారు. మోదీకి తెలివి లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడని మండిపడ్డారు.