»Haleem Eat Top 10 Places To Eat Haleem In Hyderabad 2023
Haleem Eat Top 10 Places: హలీం తినడానికి హైదరాబాద్‌లో టాప్ 10 ప్రదేశాలు
రంజాన్ పవిత్ర మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో హలీం కోసం జనాలు పెద్ద ఎత్తున ఎగబడి కొనుగోలు చేస్తుంటారు. ఈ వంటకాన్ని మటన్ లేదా చికెన్‌ని పౌండింగ్ చేసి, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులతో కలిపి.. పెద్ద పాత్రలో భట్టిపై వండి తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వంటకాన్ని ఆరగించేందుకు ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ లో ఎక్కడ హలీం ఎక్కడ బాగుంటుందో టాప్ 10 ప్రదేశాలను ఇప్పుడు చుద్దాం.
పిస్తా హౌస్ భారతదేశంలో అతిపెద్ద హలీమ్ ఎగుమతిదారుగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో పిస్తా హౌస్ మంచి రుచికరమైన అద్భుతమైన హలీమ్‌ను అందిస్తుంది. (అడ్రస్: ఎస్రా హాస్పిటల్ ఎదురుగా, శాలిబండ రోడ్, చార్మినార్, హైదరాబాద్)
2. షా ఘౌస్ కేఫ్ & రెస్టారెంట్
ప్రముఖ షా ఘౌస్ కేఫ్ హైదరాబాదీ బిర్యానీతోపాటు హలీమ్‌కు కూడా ప్రజాదరణ పొందింది. హైదరాబాద్‌లోని టాప్ హలీమ్ కేంద్రాలలో ఇది కూడా ఒకటిగా గుర్తింపు దక్కించుకుంది. (అడ్రస్: SA ఇంపీరియల్ గార్డెన్స్ ఎదురుగా, RTA ఆఫీస్ దగ్గర, టోలిచౌకి, హైదరాబాద్)
3. Y2K రెస్టారెంట్
Y2K రెస్టారెంట్ మంచి రుచికరమైన మటన్ హలీమ్‌కు ప్రసిద్ధి చెందింది. (అడ్రస్: ప్లాట్ 6-3-391, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పక్కన, పంజాగుట్ట, హైదరాబాద్)
4. పారడైజ్ ఫుడ్ కోర్ట్
పారడైజ్ ఫుడ్ కోర్ట్ హైదరాబాదీ బిర్యానీ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఫుడ్ కోర్ట్ మంచి పరిశుభ్రతతో కూడిన ఉత్తమ హలీమ్ లను అందిస్తుంది. (అడ్రస్: SD రోడ్, ప్యారడైజ్ సర్కిల్, సికింద్రాబాద్)
5. సర్వి
సర్వి.. రంజాన్ సందర్భంగా ఈ ప్రదేశాన్ని తప్పనిసరిగా ఒక్కసారి సందర్శించి హాలీంను రుచి చూడాలి. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. (అడ్రస్: మెహదీపట్నం క్రాస్ రోడ్, బస్ స్టాప్ ఎదురుగా, మెహదీపట్నం, హైదరాబాద్)
6. షాదాబ్
నిస్సందేహంగా షాదాబ్ ఉత్తమ హలీమ్‌ను అందజేస్తుందని చెప్పవచ్చు. ఆంబియెన్స్ లేకపోయినా హలీమ్ రుచి మాత్రం టేస్టీగా ఉంటుంది. (అడ్రస్: 21-1-140-144, హైకోర్టు రోడ్డు దగ్గర, మదీనా సర్కిల్ ఎదురుగా, చార్మినార్, హైదరాబాద్)
7. హోటల్ నయాగరా
హోటల్ నయాగరా హైదరాబాద్‌లోని హలీమ్ కేంద్రాలలో సందర్శించదగిన వాటిలో ఒకటి. ఇక్కడి హలీమ్‌ను చాలా మంది ఆహార ప్రియులు ఇష్టపడతారు. (అడ్రస్: చాదర్‌ఘాట్ రోడ్, మలక్‌పేట్, హైదరాబాద్)
8. కేఫ్ 555
కేఫ్ 555లో సొగసైన మంచి రుచితో కూడిన హలీమ్ ప్రసిద్ధి చెందింది. మళ్లీ మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చేలా చేస్తుంది. అంతేకాదు సరసమైన ధరలకే మటన్ హలీమ్‌ను అందిస్తుంది. (అడ్రస్: మహేశ్వరి కాంప్లెక్స్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్)
9. కేఫ్ బహార్
కేఫ్ బహార్ ఎప్పుడూ కూడా ఆహార ప్రియులతో రద్దీగా ఉండే ప్రదేశం. ప్రధానంగా రంజాన్ సమయంలో ఇక్కడ వడ్డించే రుచికరమైన హలీమ్ చిక్కగా చాలా రుచిగా ఉంటుంది. ( అడ్రస్: ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్‌గూడ, బషీర్ బాగ్, హైదరాబాద్)
10. బావర్చి
హైదరాబాద్‌లో ప్రతి రెండవ లైన్లో బావర్చి అనే హోటల్ని మనం చూడవచ్చు. కానీ అసలు బావర్చికి మాత్రం బ్రాంచ్‌లు లేవు. ఈ బావర్చి కేంద్రంలో మంచి రుచిగల హలీమ్, బిర్యానీ వంటకాలు లభిస్తాయి. (అడ్రస్: RTC క్రాస్ రోడ్, చిక్కడపల్లి, హైదరాబాద్)