త్వరలోనే పార్లమెంట్ సభ్యుల (Lok Sabha Members) సంఖ్య పెరుగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినట్లు ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుందనే వార్తతో రాజకీయ పార్టీలు (Political Parties) హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ బలం మరింత పెరుగుతుందనే ఆశలో ఉన్నాయి. అయితే సభ్యుల సంఖ్య పెరిగితే ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనమని.. దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KT Rama Rao) ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంపు అంశంపై మంగళవారం కేటీఆర్ పలు ట్వీట్లు చేశారు. ద్రవిడియన్ ఇన్ సైట్స్ (Dravidian Insights) చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ‘జనాభా (Census) ప్రాతిపదికన 2026 తర్వాత జరిగే లోక్ సభ స్థానాల డీలిమిటేషన్ (Delimitation)తో దక్షిణాది రాష్ట్రాలకు (South States) తీవ్ర అన్యాయం జరుగుతోంది. దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ మాటలు, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలు పాటిస్తూ జనాభాను దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించుకున్నాయి (Population Control). ఆ రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది’ అని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలు తక్కువ లోక్ సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు (North States) లోక్ సభ సీట్ల పెంపుతో లబ్ధి పొందుతున్నాయి. ఇది దురదృష్టకరం. జనాభా నియంత్రణ పాటించిన కేరళ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయి. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ (Human Development Index) దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. కేవలం 10 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం జీడీపీకి (GDP) నిధులు అందిస్తున్నాయి. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఊతమిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్ సభ డీలిమిటేషన్ విధానంతో భవిష్యత్ లో తమ ప్రాధాన్యం కోల్పోరాదు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘ప్రగతిశీల విధానాలకు లబ్ధి పొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల గొంతును వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపై (Injustice) నాయకులు, ప్రజలు గళమెత్తాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ గణాంకాల ఫొటో పంచుకున్నారు. డీలిమిటేషన్ తో లోక్ సభ సభ్యుల సంఖ్య పెరగడం ఆ చిత్రంలో ఉంది. సీట్ల సంఖ్య పెరిగితే ఉత్తరప్రదేశ్, బిహార్ (Bihar) 222 స్థానాలు చేరుకుంటే, మిగత రాష్ట్రాలు 461 స్థానాలు పెంచుకుంటాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం 165 స్థానాలకు మాత్రమే చేరుకుంటాయని అందులో ఉంది.
This is indeed a travesty and a tragedy of it does come true. Southern states of India have been best performers on all fronts post independence
Leaders and people of all Southern states need to raise their voices collectively cutting across political affiliations against this… https://t.co/ohE9GD8hDD