W.G: తణుకు పట్టణంలో ఇవాళ అత్యంత వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. స్థానిక రూట్స్ స్కూలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిన్నారులు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగి పళ్ళు వేసే కార్యక్రమంతో పాటు భోగి మంటలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో త్రిపాఠి, విద్యాకాంత్, వర్మ పాల్గొన్నారు.