ఖమ్మం జిల్లా జడ్జి జస్టిస్ జి.రాజగోపాల్ శనివారం నగరంలోని స్వయం శ్రీఅభయ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ అల్లిక అంజయ్య ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో సాదరంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శనానంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి బెల్లి కొండలరావు ఉన్నారు.