KRNL: దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయాన్ని శుక్రవారం ఆర్డీవో భరత్ తనిఖీ చేశారు. కార్యాలయ పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించి, ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరింత సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు.