»Actor Sonu Sood To Help Build School For Underprivileged Children In Bihar
Sonu Sood సోనూ సూద్ మరో గొప్ప పని.. అనాథ పిల్లల కోసం పాఠశాల భవనం
తనకు తెలియకుండా పాఠశాలకు తన పేరు పెట్టి సేవ చేయడాన్ని చూసి సోనూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సేవ కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకోవడం గొప్ప విషయంగా పేర్కొన్నాడు.
కరోనా సమయంలో (Corona Wave) పేదలను ఆదుకున్న వ్యక్తి నటుడు సోనూసూద్ (Sonu Sood). సామాజిక మాధ్యమాల ద్వారా తనకు సహాయం (Help) కోరిన ప్రతి ఒక్కరికీ కాదనకుండా సేవ చేశాడు.. ఇంకా ఆ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. తాజాగా అనాథ పిల్లల (Orphaned Children) కోసం ఏకంగా పాఠశాల నిర్మించనున్నాడు. ఓ వ్యక్తి చేస్తున్న దాతృత్వ సేవకు తోడై సోనూ సూద్ పాఠశాల భవనం నిర్మించేందుకు ముందుకువచ్చాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్ (Bihar)కు చెందిన బీరేంద్ర కుమార్ మహతో (27) (Birendra Kumar Mahato) అనాథల కోసం విశేష సేవలు అందిస్తున్నాడు. వారి కోసం తన ఇంజనీర్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. అనాథల కోసం కతిహార్ (Katihar)లో ఓ అంతర్జాతీయ పాఠశాలను ప్రారంభించాడు. ఆ పాఠశాలకు సోనూసూద్ పేరే పెట్టాడు. సోనూసూద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ (Sonu Sood International Public School)లో 110 మంది అనాథ పిల్లలను చదివిస్తున్నాడు. దీంతోపాటు ఉచిత భోజనం కూడా అందిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ ఈనెల 29న ఆ పాఠశాలను సందర్శించాడు. అక్కడ అనాథ పిల్లలతో సోనూ సందడి చేశాడు.
ఈ సందర్భంగా బీరేంద్ర కుమార్ చేస్తున్న సేవను అభినందించాడు. తనకు తెలియకుండా పాఠశాలకు తన పేరు పెట్టి సేవ చేయడాన్ని చూసి సోనూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సేవ కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకోవడం గొప్ప విషయంగా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆ పాఠశాలకు వెళ్లిన ఫొటోలను (Photos) సోనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా బీరేంద్ర కుమార్ పై ప్రశంసలు కురిపించాడు. ‘బీరేంద్ర కుమార్ చేస్తున్న సేవ (Service) గొప్పది. అనాథ పిల్లలకు విద్య (Education), భోజనం అందించడం గొప్ప విషయం. అతడితో నేను భాగస్వామిగా కావడం చాలా గర్వంగా ఉంది. కొత్త పాఠశాల భవనం నిర్మిస్తాం. అనాథలకు నాణ్యమైన విద్యను అందించడమే మా లక్ష్యం’ అని సోనూ సూద్ ప్రకటించారు.
Extremely grateful to be associated with the Birendra Kumar Mahato and the good work he’s doing by providing food and education for orphaned children. At the Sonu Sood International School – we aim to provide the students with quality education and we will also be building a new… pic.twitter.com/hPgQH4fq9K