IRB ORR ఎమ్మెల్యే రఘునందన్ కు భారీ షాక్.. రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా
సంబంధిత సంస్థపై కీలక ఆరోపణలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఐఆర్ బీ సంస్థ రఘునందన్ రావుపై సోమవారం పరువు నష్టం కేసు వేసింది. ఎమ్మెల్యేకు పంపిన లీగల్ నోటీసులో ఇలా ఉంది.
బీజేపీ దుబ్బాక (Dubbak) ఎమ్మెల్యే రఘునందన్ రావుకు (Raghunandan Rao) భారీ షాక్ తగిలింది. ఔటర్ రింగ్ రోడ్డుపై (Outer Ring Road) ఇష్టమొచ్చిన రీతిలో విమర్శలు, ఆరోపణలు (Allegations) చేయడంతో సంబంధిత సంస్థ ఏకంగా రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా (Defamation Notice) వేసింది. క్షమాపణ చెప్పాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు ఆ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు లీగల్ నోటీసులు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ఔటర్ రింగ్ రోడ్డు టీవోటీ లీజును (Lease) ఐఆర్ బీ ఇన్ ఫ్రా డెవలపర్స్ (IRB Infrastructure Developers Limited)కు అప్పగించింది. 30 ఏళ్ల పాటు ఈ లీజు అప్పగింత వెనుక భారీ కుంభకోణం (Scam) జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు (Revanth Reddy) రఘునందన్ రావు ఆరోపించారు. ఈనెల 25వ తేదీన మీడియాతో మాట్లాడుతూ సంబంధిత సంస్థపై కీలక ఆరోపణలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఐఆర్ బీ సంస్థ రఘునందన్ రావుపై సోమవారం పరువు నష్టం కేసు వేసింది. ఎమ్మెల్యేకు పంపిన లీగల్ నోటీసులో ఇలా ఉంది.
‘ఈనెల 25వ తేదీన మీడియాతో రఘునంద్ రావు మాట్లాడుతూ.. ఉద్యమం చేసేవారిని ఐఆర్ బీ చంపేస్తుందని పేర్కొన్నారని, దీంతోపాటు ఐఆర్ బీపై పలు బాధ్యతారహితమైన, నిరాధార ఆరోపణలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడంతోపాటు మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా.. ఉద్దేశపూర్వకంగా ఆయన వ్యాఖ్యలు చేశారు’ అని లీగల్ నోటీసుల్లో (Legal Notice) ఐఆర్ బీ పేర్కొంది. ఈ సందర్భంగా సంస్థపై రఘునందన్ రావు చేసిన హత్య ఆరోపణలపై కూడా ఐఆర్ బీ స్పష్టతనిచ్చింది. ‘గతంలో జరిగిన ఆర్టీఏ కార్యకర్త (RTA Activist) హత్యకేసుతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పుణె సెషన్స్ కోర్టు (Pune Sessions Court), ముంబై హైకోర్టు (Mumbai Highcourt) క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఐఆర్ బీ గుర్తు చేసింది.
‘వాస్తవాలు తెలుసుకోకుండా సంస్థ పరువును దెబ్బతీసేలా రఘునందన్ రావు మాట్లాడారు. మా సంస్థను బ్లాక్ లిస్టులో (BlackList) పెట్టారనే వ్యాఖ్యలు కూడా పూర్తిగా నిరాధారం. పలు జాతీయ ప్రాజెక్టుల్లో ఐఆర్ బీ పెట్టుబడి భాగస్వామిగా ఉంది.. ఎక్కడా బ్లాక్ లిస్టులో లేదు. వాస్తవాలు తెలియకుండా మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల (Political Interests) కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మా సంస్థ పరువుకు తీవ్ర భంగం కలిగింది. దీనికి బహిరంగ క్షమాపణ (Apologise) చెప్పాలి. లేదంటే రూ.1000 కోట్ల పరువు నష్టం కింద చెల్లించాలి. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఐఆర్ బీ లీగల్ నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఈ లీజుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హెచ్ఎండీఏ (HMDA) కూడా తీవ్రంగా పరిగణించింది. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.