»Self Defense Of Nizamabad Police Firing Into The Air At Indalvai
Indalvai అచ్చం సినిమాలో మాదిరి ఘటన.. నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం
పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాపర్ ను దొంగిలిస్తున్న ముఠాగా పోలీసులు తెలిపారు. తరచూ ఈ సంఘటన జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆట కట్టించే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో (Telangana) మరోసారి కాల్పులు (Gun Fire) కలకలం రేపాయి. దొంగలను పట్టుకునేందుకు రెక్కీ (Recce) నిర్వహించగా.. పోలీసులను గమనించిన దొంగలను తప్పించకునే క్రమంలో వాహనాన్ని ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకోలేక పోలీసులు (Police) కాల్పులు జరిపారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) చోటుచేసుకుంది.
రాజస్థాన్ (Rajasthan)కు చెందిన దొంగల ముఠాను (Thieves Gang) పట్టుకునేందుకు ఇందల్వాయి (Indalvai) మండలంలోని జాతీయ రహదారిపై (National Highway) పోలీసులు కాపు కాశారు. ఈ సందర్భంగా పోలీసులు బారికేడ్లు (Barricades) ఏర్పాటుచేశారు. వేగంగా వస్తున్న ఐదుగురితో కూడిన దొంగల ముఠా బారికేడ్లను ఢీకొట్టింది. వెంటనే సీఐ, ఐదుగురు ఎస్సైలు బయటకు వచ్చారు. వెంటనే కారును అక్కడే వదిలేసి దొంగల ముఠా అక్కడి నుంచి పరారైంది. దొంగలు పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
అచ్చం సినిమాలో మాదిరి జరిగిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. కాగా, పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాపర్ (Coper) ను దొంగిలిస్తున్న ముఠాగా పోలీసులు తెలిపారు. తరచూ ఈ సంఘటన జరుగుతుండడంతో రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆట కట్టించే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ముప్కాల్ మండలంలో విద్యుత్ ట్రాన్సాఫార్మర్లలో కాపర్ కాయిల్ చోరీ చేసిన అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకునే ప్రయత్నంలో ఆ సంఘటన జరిగిందని ఇందల్వాయి ఎస్సై నరేశ్, దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు.