»In A Drunken Drive One Person Found And Attacked The Police At Nizamabad District
Viral video: డ్రంక్ డ్రైవ్ లో..దొరికి పోలీసులపైనే దాడి!
తెలంగాణలో పలువురికి పోలీసులు(police) అంటే కనీసం గౌరవం లేకుండా పోయింది. మద్యం సేవించిన ఓ వ్యక్తికి ఏకంగా మరో వ్యక్తి సపోర్ట్ చేయడమే కాదు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ సంఘటన ఇటివల జరుగగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసుల(police)కు దొరికాడు. అయితే ఆ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి పోలీసులపైకి వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా పోలీసులనే నెట్టేస్తూ నానా రచ్చ చేశారు. స్పీకర్ గారిని ఫోన్లో లైన్లోకి తీసుకున్నా కూడా..మీరు మాట్లాడరా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఆ నేపథ్యంలో పోలీసులను నెట్టేస్తూ నడి రోడ్డుపైనే నానా హంగామా సృష్టించారు. పోలీసులు అనే కనీస గౌరవం కూడా లేకుండా పోరా బాయ్ అంటూ వారిని నెట్టేశారు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా(nizamabad district) రుద్రూర్ మండల కేంద్రంలో నిన్న రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(drunken drive) తనిఖీలు చోస్తున్న క్రమంలో కోటగిరి మండలం కొత్తపల్లికి చెందిన ఓ యువకుడు మద్యం సేవించి తన భార్యతో అతని స్వగ్రామనికి వెల్తుండగా పోలీసులు అతన్ని ఆపారు. అప్పుడు అతనికి 360 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదే క్రమంలో కొటగిరి మండలం సుద్దుల గ్రామ సర్పంచ్ సాయిలు అటువైపుగా వచ్చి వారిని చూసి పోలీసుల వద్దకు వచ్చాడు. ఆ నేపథ్యంలో మద్యం సేవించిన యువకుడిని వదిలిపెట్టాలని పోలీసులను కోరాడు. తనకు అనేక మంది ప్రజాప్రతినిధులు తెలుసని వారని వదిలిపెట్టాలని డిమాండ్ చేశాడు. మద్యం సేవించిన వ్యక్తికి జరిమానా వేస్తామని పోలీసులు చెప్పగా సర్పంచ్ వినకుండా నానా రచ్చ చేశారు. అంతేకాదు పోలీసులు వాహనం తాళం లాక్కుని రోడ్డుపై హంగామా సృష్టించారు. ఈ వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్(viral video)గా మారింది.
డ్రంక్ డ్రైవ్లో పట్టుబడి పోలీస్ మీద దాడి
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రాత్రిపూట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కోటగిరి మండలం, కొత్తపల్లికి చెందిన ఓ యువకుడు బాగా మద్యం తాగి భార్యతో స్వగ్రామానికి వెళ్తుండగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్… pic.twitter.com/m4yRoTCEvb