ఫోన్లను కొట్టేసి ఐఎంఈఐ(IMEI) నెంబర్లు మార్చే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొత్తవాటిని అమ్మి సొమ్ముచేసుకునే ఈ గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి దగ్గర ఎన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.
The gang stole 563 smart phones. Extortion in crores
Smart phones: భారీగా సెల్ఫోన్ల(Cell phones)ను దొంగలించి వాటి ఐఎంఈఐ(IMEI) నెంబర్లను మార్చి కోట్లు గడిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాములుగా ఫోన్లను ప్యాకెట్లేనో, లేదా హ్యాండ్ బ్యాగులోనే ధరించడం అలవాటు. ఆ క్రమంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే. అవి ఆ స్థానాల్లో ఉండవు. కట్ చేస్తే ఫోన్ స్విచాఫ్. ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే అప్పటికే దాని ఐఎంఈఐ నెంబరు మారుతుంది. ఇంత ఫాస్ట్‌గా ఏ హడావిడీ లేకుండా పని చేసే ఘరానా ముఠాను హైదరాబాద్(Hyderabad) పోలీసులు(police) రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
ఇక వారిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చింది. మూడు రాష్ట్రాల్లో చోరీ చేసిన దాదాపు 563 స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చి నగరంలో ఐఎమ్ఈఐ నెంబర్లను మార్చి తిరిగి కొత్త సెల్ ఫోన్లుగా మార్చి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. అది తెలిసిన గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు వారిని పట్టుకున్నారు. కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో కొట్టేసి నగరానికి తీసుకు వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.
అయితే వారి గ్యాంగ్ 50 మంది వరకు ఉన్నారని, అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేసే వారని తెలిపారు. అలా చోరీ చేసిన ఫోన్లు దేశంలో వివిధ ప్రాంతాల్లో అమ్మేసి సోమ్ము చేసుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ 563 మొబైళ్ల విలువ రూ.2.50 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక ఈ ముఠా తిరిగి వెళ్లెప్పుడు ఇక్కడ కొట్టేసిన వాటిని ముంబై, ఢిల్లీ రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ ముఠా అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.