భర్త నల్ల(Black)గా ఉన్నాడని ఓ భార్య(Wife) వేధించడం మొదలు పెట్టింది. భార్య చేష్టలు మితిమీరిపోయాయి. లేనిపోని కారణాలతో ఆమె తన భర్తను దూరం పెడుతూ వచ్చింది. ఈ తరుణంలో ఆ భర్త కోర్టును ఆశ్రయించాడు. చివరికి కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఈ కేసులో భార్య వైఖరిని తప్పుబట్టింది. ఆ దంపతులకు విడాకులను(Divorce) మంజూరు చేసింది. భర్తను భార్య నల్లగా ఉన్నాడని వేధించడం క్రూరత్వం అవుతుందని కోర్టు తెలిపింది.
నల్ల(Black)గా ఉన్నాడని పదేపదే వేధించడం వల్ల భార్యను ఆ భర్త విడిచిపెట్టాల్సి వచ్చిందని హైకోర్టు వెల్లడించింది. అయితే భార్య తన వేధింపుల విషయం కప్పిపుచ్చుకోవడానికి భర్తపై లేనిపోని ఆరోపణలు చేయడంపై కోర్టు సీరియస్ అయ్యింది. భర్త(Husband)పై వివాహేతర సంబంధం ఆరోపణలు కూడా చేయడం పట్ల హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(ఐ)(ఏ) ప్రకారంగా ఆ జంటకు విడాకులను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఆ జంట 2007లో పెళ్లితో ఒక్కటైంది. వీరికి ఓ అమ్మాయి ఉంది. 2021లో భర్త తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనంత రామనాథ్ హెగ్డేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కూతురి కోసం భర్త అనేక అవమానాలను భరించాడని కోర్టు వివరించింది.
మొదటగా భర్తే తనను వేధింపులకు (Harrassment) గురిచేస్తున్నట్లు ఆ భార్య గృహ హింస కేసు పెట్టగా దాని పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఆ భార్య వాదనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. భర్త నల్ల(Black)గా ఉండటం వల్ల వైవాహిక బంధంలో కొనసాగేందుకు ఆమెకు ఇష్టం లేదన్న విషయాన్ని కోర్టు (High Court) గ్రహిస్తూ ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది.