»The Cm Who Tied 14 Departments To A Single Minister
Delhi minister : ఒకే మంత్రికి 14 శాఖలు కట్టబెట్టిన సీఎం
దేశ రాజధాని బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించే ‘ఢిల్లీ సేవల బిల్లు’ పార్లమెంటు ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి సౌరభ్ భరద్వాజ్(Saurabh Bhardwaj)ను సేవలు, విజిలెన్స్ విభాగం బాధ్యతల నుంచి తప్పించి.. ఆ రెండు శాఖలను ఆతిశీ(Atishi)కి అప్పగించింది. పార్లమెంట్లో దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇదివరకు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్(Saurabh Bhardwaj) రెండు పోర్ట్‌ఫోలియోలకు నాయకత్వం వహించారు. మంత్రివర్గ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనను సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Governor VK Saxena) కు పంపారు.ఢిల్లీ క్యాబినెట్లో ఏకైక మహిళా మంత్రి అయిన అతిషి వద్ద ఇప్పుడు ఏకంగా 14 పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి.
ఇందులో కీలకమైన విద్య, విద్యుత్ శాఖలు ఉన్నాయి. అతిషి కల్కాజీ (Atishi Kalkaji) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో జైలులో ఉన్న మనీష్ సిసోడియా(Manish Sisodia), సత్యేందర్ జైన్ రాజీనామాల చేయడంతో సౌరభ్ భరద్వాజ్, అతిషి ఈ ఏడాది మార్చిలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో దిల్లీ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సౌరభ్ భరద్వాజ్ చూస్తున్న శాఖలను ఉద్దేశించి కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) తీవ్ర ఆరోపణలు చేశారు. అర్థరాత్రి ఫైల్స్ అడుగుతారని, స్పెషల్ సెక్రటరీ(విజిలెన్స్)కి రిపోర్టు చేయుద్దని అధికారులకు చెప్తారంటూ విమర్శలు చేశారు. అలాగే సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు తర్వాత సర్వీస్ సెక్రటరీని బదిలీ చేశారని గుర్తు చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.