డ్రోన్ విమానం (Drone Plane) నల్లగొండ జిల్లాలో (Nalgonda District) కలకలం రేపింది. ఎగురుతూ వచ్చిన డ్రోన్ విమానం పంట పొలాల్లో (Farm Lands) కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా పొలంలో ఉన్న రైతులు (Farmers), కూలీలు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాంబు స్క్వాడ్ (Bomb Squad)తో వచ్చి పరిశీలించారు.
శాలిగౌరారం (Shaligouraram) మండలం ఆకారం గ్రామ శివారులోని పొలాల వద్ద సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా తెల్లటి డ్రోన్ విమానం కూలింది. ఈ వాహనం బ్యాటరీతో ప్రయాణిస్తుంది. దీనిలో కెమెరాలు, జీపీఎస్ వ్యవస్థ (GPS System) ఉంది. ఈ డ్రోన్ ఐదడుగుల పొడవు, వెడల్పుతో సుమారు 15 కిలోల బరువు ఉంది. విమానంపై 76 అనే కోడ్ నంబర్ ఉంది. కాగా, ఈ ఘటనకు సమీపంలోని వట్టిపాముల (Vattipamula) గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఈ డ్రోన్ కోసం స్థానికులను ఆరా తీసినట్లు సమాచారం. డ్రోన్ లోని సిమ్ కార్డును (SIM Card) తీసి కనెక్ట్ చేసేందుకు ప్రయత్నించగా కనెక్ట్ కాలేదు. ఈ డ్రోన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రోన్ విమానం దేని కోసం ప్రయోగించారోనని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.