తెలంగాణ (Telangana)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. చింతపల్లి మండలం (Chintapalli Mandal) నర్సర్లపల్లి వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ఓ బాలుడు సహా మరో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
రోడ్డు ప్రమాదం (Road accident)లో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మద్దిమడుగు ప్రసాద్ (38), మద్దిమడుగు అవినాశ్ (12), పట్నపు మణిపాల్ (18), మద్దిమడుగు రమణ (35), వనం మల్లికార్జున్ (12) మరణించినట్లుగా తెలిపారు. ఆస్పత్రిలో పులి పవన్ (18), వరాల మనివర్ధన్ (18) చికిత్స పొందుతున్నారు.