»Telangana Decade Celebrations Will Be Held In Madhya Pradesh And Assam Also
Telangana Formation మధ్యప్రదేశ్, అస్సాంలోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ అవతరణ ఉత్సవాలు దేశ, విదేశాల్లో కూడా జరుగనున్నాయి. దేశంలోని మధ్యప్రదేశ్, అస్సాంలో అధికారికంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనుండడం విశేషం. ఈ మేరకు అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.
దశాబ్దాల పోరాటం ఫలించి స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ (Telangana) పదో పడిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను (Telangana Decade Celebrations) అంగరంగ వైభవంగా చేసుకుంటోంది. ఈ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. దీనికి పోటీగా కేంద్ర ప్రభుత్వం తూతూమంత్రంగా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే తెలంగాణ అవతరణ ఉత్సవాలు దేశ, విదేశాల్లో కూడా జరుగనున్నాయి. దేశంలోని మధ్యప్రదేశ్ (Madhya Pradesh), అస్సాంలో (Assam) అధికారికంగా (Official) ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనుండడం విశేషం. ఈ మేరకు అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.
జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ లో రాజ్ భవన్ (Raj Bhavan)లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు తనకు ఆహ్వానం అందిందని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి.నరహరి (P. Narahari) తన ట్విటర్ లో తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొననుండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గవర్నర్ మంగుభాయి పటేల్ (Mangubhai C. Patel) అధ్యక్షతన జరిగే ఈ ఉత్సవాలకు మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ (Mohan Yadav) హాజరుకానున్నారు.
ఇక అస్సాం ప్రభుత్వం కూడా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనుంది. రాజ్ భవన్ లో నిర్వహించే వేడుకలకు హాజరుకావాలని అస్సాం తెలుగు సంఘానికి (Assam Telugu Association) ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. కాగా మరికొన్ని రాష్ట్రాల్లో (Other States) కూడా తెలంగాణ అవరతణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
జయహో #తెలంగాణ ! మొదటిసారి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అధికారికంగా “తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు”. 🇮🇳 ఈ కార్యక్రమం మహాకాల్ ఉజ్జైన్ నగరంలో జూన్ 2న మధ్య ప్రదేశ్ గౌరవ @GovernorMP మాన్యులు శ్రీ మంగుభాయి పటేల్ గారి అధ్యక్షతన జరుగును. #Telanganapic.twitter.com/otXGFebnqt