మద్యంమత్తులో కారు నడుపుతూ కొందరు యువకులు వచ్చారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై దురుసుగా ప్రవర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు సహకరించకుండా గొడవ చేశారు.
మద్యంమత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) పరీక్షల సమయంలో అటుగా వచ్చిన వారు కారును (Car) ఆపకుండా అలాగే పోనిచ్చారు. అడ్డు వచ్చిన కానిస్టేబుల్ ను ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా (Nalgonda District) మిర్యాలగూడలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మిర్యాలగూడ పట్టణం (Miryalaguda) హనుమాన్ పేట ఫ్లై ఓవర్ వద్ద సోమవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మద్యంమత్తులో కారు నడుపుతూ కొందరు యువకులు వచ్చారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా మందుబాబులు (Drunkers) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై దురుసుగా ప్రవర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు సహకరించకుండా గొడవ చేశారు. ఈ సమయంలో బ్రీత్ ఎనలైజర్ (Breathalyzer Test) పరీక్ష చేసేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ లింగారెడ్డిని (Constable Linga Reddy) కారుతో ఈడ్చుకెళ్లారు. దాదాపు 50 మీటర్లకు పైగా కానిస్టేబుల్ ను లాక్కెళ్లారు. ఈ సంఘటనతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు.
అక్కడి నుంచి నిందితులు కారుతో ఉడాయించారు. ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ ను ఆస్పత్రికి (Hospital) తరలించారు. కారు ఆపకుండా వెళ్లిన వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ లింగారెడ్డి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు, అతడి కారు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా మందుబాబులు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తున్నది.