VSP: జీవీఎంసీ 4వ వార్డు జేవీ అగ్రహారంలో సోమవారం నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ వారోత్సవాల్లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాల అమలుపై ఆరా తీశారు. అన్నదాత సుఖీభవ నిధులు అందని 810 మందికి త్వరలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు.